హైదరాబాద్, మే 1 (నమస్తేతెలంగాణ) : మిశ్రమ (అంతర) పంటల సాగులో తెలంగాణ రాష్ట్రం వెనుకంజలో ఉందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ అధ్యయనం వెల్లడించింది. 2023-24 ఏడాది అధ్యయన రిపోర్ట్ ఆ శాఖ తాజాగా విడుదల చేసింది. వరి పంట సాగు, ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, మిశ్రమ పంటల సాగులో పురోగమించడం లేదని గుర్తించింది.
రైతులు ప్రధాన పంటలు పండించేందుకే ఎకువ ఆసక్తి కనబరుస్తున్నట్టు పేరొంది. అంతర పంటలపై అంతగా ఆసక్తి లేకపోవడం, ప్రభుత్వపరంగా ఆశించిన స్థాయిలో ప్రోత్సాహం లేకపోవడం తదితర అంశాలు కారణాలుగా తెలిపింది. మిశ్రమ పంటల సాగులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే 12వ స్థానంలో నిలిచింది.