హైదరాబాద్: తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరును తెలంగాణ పోలీస్ హౌసింగ్ ఇన్ఫ్రాటెక్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ( TGPICS ) గా మారింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయని ఎండీ ఎం. రమేశ్ తెలిపారు.
కార్పొరేషన్ పేరును సవరించేందుకు ప్రభుత్వాన్ని అనుమతి కోరామని.. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని రమేశ్ తెలిపారు. దీంతో తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరును తెలంగాణ పోలీస్ హౌసింగ్ ఇన్ఫ్రాటెక్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మారిందని పేర్కొన్నారు. శనివారం నుంచే ఈ పేరు మార్పు అమల్లోకి వచ్చిందని చెప్పారు. పేరు మార్పు తర్వాత కార్పొరేషన్ TGPICS గా పిలవబడుతుందని అన్నారు.