హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): పేద విద్యార్థుల ఆకలి తీర్చాలనే సదుద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘ఉపాహార పథకం’పై కూడా విపక్ష పార్టీలు అకసు వెళ్లగక్కుతూ రాక్షసానందం పొందుతున్నాయని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం ఉపాహార పథకాన్ని పార్టీలకు అతీతంగా అందరూ హర్షించాల్సిన విషయమని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మానవత్వం ఉన్న వారెవరూ ఈ పథకాన్ని వ్యతిరేకించరని, ప్రతిపక్షాలు ఈ పథకంలో కూడా రాజకీయాలు చేయడం వారి రాక్షస మనస్తత్వానికి నిదర్శనమని విమర్శించారు