హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మాదాపూర్లోని మాట్లిస్ దవాఖానకు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (టీఎస్ఎంసీ) నోటీసులు జారీ చేసింది. దవాఖాన వైద్యులతో అనర్హులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు సోషల్ మీడియా ద్వారా తమ దృష్టికి వచ్చినట్టు తెలిపింది.
ఈ అంశంపై ఈ నెల 26లోపు వివరణ ఇవ్వాలని, తరగతులను ఆపేయాలని స్పష్టంచేసింది.