హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం మాత్రం అన్ని మార్గాలను అ న్వేషిస్తున్నది. భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి మరో రూ.3,000 కోట్లు రణం తీసుకునేందుకు చర్యలు చేపట్టింది. ఈ నెల 10న నిర్వహించే బహిరంగ వేలంలో అప్పు తీసుకునేందుకు సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టింది.
30 ఏండ్ల కాలానికి 1,000 కోట్లు, 31 ఏండ్ల కాలానికి మరో రూ.1,000 కోట్లు, 32 ఏండ్ల కాలాని కి ఇంకో రూ.1,000కోట్లు తీసుకుంటామని రేవంత్ ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్లు పెట్టినట్టు శుక్రవారం ఆర్బీఐ వెల్లడించింది. 2025-26 ఆర్థిక సం వత్సరం తొలి త్రైమాసికంలో రూ.14 వేల కోట్ల రుణం కోసం ఆర్బీఐకి రాష్ట్ర సర్కారు ప్రతిపాదనలు పంపించింది. ఏప్రిల్లో రూ.4,400 కోట్లు, మేలో 4,500 కోట్లు, జూన్ 3న రూ.1,500 కోట్లు కలిపి మొత్తం రూ.10,400 కోట్లు సేకరించింది. ఈ ఆర్థిక సంవత్సరం మార్కెట్ రుణాల కింద రూ.64,539 కోట్లు సమీకరిస్తామని బడ్జెట్లో ప్రతిపాదించింది.