హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు జూలై 8, 9 తేదీల్లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు కలకొండ కాంతయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ బాలమల్లేశ్ ఆదివారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధుం భవన్లో ఈ సమావేశాలు జూలై 8న ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. రాష్ట్ర సమితి సభ్యులు సకాలంలో హాజరుకావాలని వారు కోరారు.