హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు కొనుగోళ్లలో 10% సౌర విద్యు త్తు కొనుగోలు లక్ష్యాలను తెలంగాణ అధిగమించింది. ఈ విషయంలో కర్ణాటక (17.6శాతం), ఏపీ (15.1శాతం), రాజస్థాన్ (11.2శాతం) తరువాత 10.1%తో తెలంగాణ 4వ స్థానంలో నిలిచింది.
గురువారం లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ జవాబిచ్చారు.