హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మూడో శాసనసభ స్పీకర్‌ను 14న ఎన్నుకోనున్నారు. గవర్నర్ ఆదేశాల మేరకు శాససనసభ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. గురువారం ఉదయం 10.30 గంటలకు స్పీకర్‌ను సభ ఎన్నుకుంటుంది. స్పీకర్ పదవికి పోటీపడే అభ్యర్థుల నుంచి బుధవారం ఉదయం 10.30 నుంచి సా యంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరిస్తారని చెప్పారు. కాంగ్రెస్ తమ అభ్యర్థిగా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్ పేరును ఖరారు చేసిన విషయం తెలిసిందే.