హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ) : కొత్తగా 790 ప్రీ ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. గతంలో 210 స్కూళ్లను ఏర్పాటు చేయగా, తాజాగా మరిన్ని స్కూళ్లను ఏర్పాటుచేసింది. దీంతో ప్రీ ప్రైమరీ స్కూళ్ల సంఖ్య వెయ్యికి చేరింది.
ఈ స్కూళ్ల నిర్వహణకు రూ. 33 కోట్ల బడ్జెట్‌కు అనుమతిచ్చింది. మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ శనివారం విడుదల చేసింది. వచ్చే విద్యాసంవత్సరం ఒకటో తరగతిలో చేరే వారిని వీటిల్లో చేర్చుకుంటారు. బోధనకు ఇంటర్ చదివి అదే గ్రామంలో ఉండే ఒకరిని ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్‌గా నియమించడంతోపాటు ఆయాలను కూడా నియమిస్తారు.