హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం నిర్వహిస్తున్న వన మహోత్సవం-2026కు అటవీశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ ఎకో పారులో అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి గురువారం మొక్కనాటి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా అటవీ సంరక్షణ ప్రధాన అధికారులు (పీసీసీఎఫ్) వినయ్‌కుమార్, సీసీఎఫ్ ప్రియాంక వర్గీస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ గుగులోత్ రవి ఏర్పాట్లను పరిశీలించారు.
రాష్ట్రవ్యాప్తంగా 16.06 కోట్ల మొకలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ఈ వేదిక నుంచి నిజామాబాద్, కొత్తగూడెం, హనుమకొండ, మెదక్, మహబూబ్ నగర్, ములుగు, నారాయణపేట, భూపాలపల్లి, సంగారెడ్డి, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో రూ.17.66 కోట్ల విలువైన అర్బన్ పారులు, ఎకో పారులు, వన్యప్రాణి సంరక్షణ, జూ ఆధునీకరణ, పర్యావరణ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను వర్చువల్ విధానంలో సీఎం ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.