హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురష్కరించుకుని ఈ నెల 26న తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం తెలంగాణ సారస్వత పరిషత్‌లో ‘గణతంత్ర భారత్ – జాగ్రత్త భారత్’ అంశంపై సెమినార్ నిర్వహించనున్నది. సెమినార్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలకోపన్యాసం చేయనున్నారని విద్యార్థి విభాగం నేతలు తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తిని రక్షించడంలో సవాళ్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు, మహిళలు, మైనారిటీలు, బలహీనవర్గాల సాధికారత, కులగణన సహా 16 అంశాలపై సెమినార్లో చర్చించనున్నారు. భారత రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేందుకు, ఫలాలను మరింత విస్తృతంగా అన్ని వర్గాలు ప్రజలందరి భాగస్వామ్యం అవసరమని, ఆదిశగా జరుగుతున్న ప్రయత్నంలో భాగంగానే ఈ సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సదస్సు పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో నవీన్ ఆచారి, చరణ్ పసుల, శ్రీకాంత్‌గౌడ్, లింగం, డాక్టర్ సత్య, వసుమతి, కృష్ణకిశోర్, శ్రీనివాస్‌గౌడ్, మాడహ రీశ్రీధరెడ్డి, జన్ము రాజు, అశోక్ యాదవ్, గాజుల అరుణ్ పాల్గొన్నారు.