తెలుగు యూనివర్సిటీ, మార్చి 5: తెలంగాణ సారస్వత పరిషత్తు 2023 సంవత్సరానికి ఉత్తమ గ్రంథ పురస్కారాలకు రచనలను ఆహ్వానిస్తున్నట్టు పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ చెన్నయ్య ఒక ప్రకటనలో తెలిపారు. పద్య, గేయ, వచన కవిత్వాలు, కథ, విమర్శ, నవల, యువ తదితర పురస్కారాల కోసం మార్చి 31వ తేదీలోగా రచనలను పంపవచ్చని కోరారు.
యువ పురస్కారానికి 35 ఏండ్లలోపు రచయితలు అర్హులని తెలిపారు. కవిత్వం అయితే కనీసం 60 పుటలు, కథ, విమర్శ, నవల, ఇతర ప్రక్రియలైతే వంద పుటలకు తక్కువ ఉండొద్దని పుస్తకం మూడు ప్రతులను తెలంగాణ సారస్వత పరిషత్తుకు పంపించాలని పేర్కొన్నారు.