హైదరాబాద్ : తెలంగాణలో ఒమిక్రాన్ వ్యాప్తి కొనసాగుతున్నది. తాజా మరో 12 మందికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన పది మందిలో ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యింది. మరో ఇద్దరు కాంటాక్టు వ్యక్తులకు వైరస్ సోకినట్లు గుర్తించారు. తాజా కేసులతో కలిసి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 55కు పెరిగింది. ఇప్పటి వరకు 10 మంది బాధితులు కోలుకున్నారు. కొత్త కేసుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన వ్యక్తి ఇటీవల దుబాయి నుంచి రాగా.. ఒమిక్రాన్ సోకిన విషయం తెలిసిందే. ఆ వ్యక్తి తల్లితో పాటు భార్యకు సైతం ఇవాళ ఒమిక్రాన్ సోకినట్లు తేలింది. అలాగే ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన వ్యక్తికి సైతం ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యింది.