విద్యుత్తు కార్మికుల ఆందోళన.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్తు ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీవీఏఈ జేఏసీ) ఆధ్వర్యంలో ఆర్టిజన్ కార్మికులు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్తు కార్యాలయాల ఎదుట ఆందోళనకు దిగారు.
- సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
- ఏప్రిల్ 7తరువాత సమ్మెకు..
- సర్కార్కు ఆర్టిజన్ల హెచ్చరిక
నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 30 : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్తు ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీవీఏఈ జేఏసీ) ఆధ్వర్యంలో ఆర్టిజన్ కార్మికులు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్తు కార్యాలయాల ఎదుట ఆందోళనకు దిగారు. కరీంనగర్లోని సర్కిల్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో రాష్ట్ర కోకన్వీనర్ చందర్ సింగ్ ఠాగూర్ మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమ తరహాలో దశల వారీగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలోని సబ్స్టేషన్ ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని విద్యుత్తు కార్యాలయాల ఎదుట బైఠాయించారు. కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నల్లగొండ డివిజన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, ఎల్లారెడ్డి, ఆర్మూర్ డివిజన్లలోని ట్రాన్స్కో కార్యాలయాల ఎదుట బైఠాయించారు. ఏప్రిల్ 7లోగా సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

