నామినేషన్ల పరిశీలనకు నలుగురే రావాలి
అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన సమయంలో ఒక్కో అభ్యర్థి తరఫున నలుగురిని, నామినేషన్ల ఉపసంహరణ సమయంలో ఒక్కరిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని సీఈవో వికాస్‌రాజ్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు అభ్యర్థులు, రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.
- ఉపసంహరణ సమయంలో ఒక్కరికే అనుమతి: వికాస్‌రాజ్
హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన సమయంలో ఒక్కో అభ్యర్థి తరఫున నలుగురిని, నామినేషన్ల ఉపసంహరణ సమయంలో ఒక్కరిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని సీఈవో వికాస్‌రాజ్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు అభ్యర్థులు, రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో బీఆర్కేభవన్లో సమావేశం నిర్వహించారు. నామినేషన్ల ఉపసంహరణ సమయంలో అభ్యర్థి గానీ ఆయనను ప్రతిపాదించిన వ్యక్తి లేదా ఎన్నికల ఏజెంట్ రావాల్సి ఉంటుందని తెలిపారు.
పార్టీలు తమ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలను వెంటనే సమర్పించాలన్నారు. మ్యానిఫెస్టోలను విడుదల చేసిన 3 రోజుల్లోగా వాటి ప్రతులను అందజేయాలని సూచించారు. మీడియాలో అభ్యర్థులు, పార్టీలు చేసే ప్రచారానికి సంబంధించిన కంటెంట్‌కు 3 రోజుల ముందే అనుమతి తీసుకోవాలని, రిజిస్టర్డ్ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులైతే వా రం ముందే అనుమతి తీసుకోవాలని కోరారు. ఓటరు గుర్తింపు కార్డుల ముద్రణను ఈ నెల 15లోగా పూర్తిచేస్తామని తెలిపారు. ఈ నెల 10 తర్వాత బీఎల్వోల ద్వారా ఓటరు స్లిప్పుల పంపిణీని ప్రారంభిస్తామని చెప్పారు.
రేవంత్‌పై కేసు పెట్టాలి: భరత్ కుమార్
బహిరంగ సభల్లో బూతులు మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై సుమోటోగా కేసులు నమోదు చేయాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్ ఈ సమావేశంలో కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

