ఇంటివద్దే ఎఫ్ఐఆర్దేశంలోనే తొలిసారి
ప్రత్యేక కేసుల్లో బాధితుల వద్దకే పోలీసింగ్ వ్యవస్థను తీసుకెళ్లాలని తెలంగాణ సీఐడీ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నది. బాధితులకు మరింత చేరువై మానవీయ కోణంలో సేవలందించేందుకు దేశంలోనే తొలిసారి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఐడీ డీజీ చారుసిన్హా మంగళవారం వెల్లడించారు.
- తెలంగాణ సీఐడీ నిర్ణయం
హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక కేసుల్లో బాధితుల వద్దకే పోలీసింగ్ వ్యవస్థను తీసుకెళ్లాలని తెలంగాణ సీఐడీ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నది. బాధితులకు మరింత చేరువై మానవీయ కోణంలో సేవలందించేందుకు దేశంలోనే తొలిసారి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఐడీ డీజీ చారుసిన్హా మంగళవారం వెల్లడించారు. దీంతో పోలీసులే బాధితుల నివాసానికి లేదా వారు కోరిన ప్రదేశానికి వెళ్లి ఎఫ్ఎఆర్ నమోదు చేస్తారని తెలిపారు. నేరం జరిగినప్పుడు బాధితులు ఫోన్ ద్వారా లేదా మౌఖికంగా సమాచారం అందిస్తే చాలని, ఆ వెంటనే సంబంధిత పోలీస్ అధికారి ఘటనా స్థలానికి/బాధితుల నివాసానికి లేదా వారు చికిత్స పొందుతున్న దవాఖానకు చేరుకుని అక్కడే ఫిర్యాదు స్వీకరిస్తారని, అనంతరం ఆ ఫిర్యాదును పోలీస్ స్టేషన్‌కు పంపి కేసు నమోదు చేయడంతోపాటు రిజిస్టరైన ఎఫ్ఐఆర్ ప్రతిని బాధితులకు వారి ఇంటి వద్దే అందజేస్తారని వివరించారు. ఈ విధానం వల్ల దర్యాప్తులో జాప్యం తగ్గుతుందని, సా క్ష్యాధారాలు తారుమారు కాకుండా చూడొచ్చని చెప్పారు. మహిళలు, పిల్లలు, ఎస్సీ/ఎస్టీలపై జరిగే నేరాలు, శారీరక దాడులు, బాల్య వివాహాలు, ఆస్తి వివాదాలు, ర్యా గింగ్ కేసుల్లో బాధితులకు తక్షణ ఊరట కల్పించేందుకు ఈ విధానం దోహదపడుతుందని పేర్కొన్నారు. అన్ని పోలీస్ యూనిట్లు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఈ నూతన ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని పాటించాలని, బాధితులకు న్యాయమే లక్ష్యంగా పోలీసులు పనిచేయాలని చారుసిన్హా స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

