బ్యాడ్మింటన్ పోటీల్లో కాంస్య పతకాలు అందుకున్న పోలీస్ అకాడమీ అసిస్టెంట్ డైరెక్టర్
తెలంగాణ పోలీసు అకాడమీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న గంటా వెంకట్రావు ఆలిండియా పోలీస్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2024లో సత్తా చాటారు. మార్చి 18వ నుంచి 21వ తేదీ వరకు హైదరాబాద్‌లో జరిగిన ఈ పోటీల్లో 55 ఏండ్లు పైబడిన వారి విభాగంలో ఆడి రెండు కాంస్య పతకాలను గెలుపొందారు.
తెలంగాణ పోలీసు అకాడమీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న గంటా వెంకట్రావు ఆలిండియా పోలీస్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2024లో సత్తా చాటారు. మార్చి 18వ నుంచి 21వ తేదీ వరకు హైదరాబాద్‌లో జరిగిన ఈ పోటీల్లో 55 ఏండ్లు పైబడిన వారి విభాగంలో ఆడి రెండు కాంస్య పతకాలను గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయన్ను అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ అభినందించారు.
గంటా వెంకట్రావు గత 25 ఏండ్లుగా నిరంతర సాధనతో బ్యాడ్మింటన్ ఆటకు, పోలీస్ డిపార్ట్మెంట్కు ఎంతగానో సేవ చేస్తున్నారు. 1991 బ్యాచ్‌లో ఎస్సైగా రిక్రూట్ అయిన వెంకట్రావు ఉత్తమ అధికారిగా పలుమార్లు కేంద్ర, రాష్ట్ర పతకాలను సాధించారు. ఖమ్మం బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా, రాష్ట్ర బ్యాడ్మింటన్ సెక్రటరీగా సేవలు అందిస్తూ.. పోలీస్ డిపార్ట్మెంట్లో ఇన్వెస్టిగేషన్లో కూడా ఎన్నో మెడల్స్‌ను అందుకున్నారు. 2017 లో కేరళలో జరిగిన ఆలిండియా పోలీస్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీల్లో గోల్డ్ మెడల్ కూడా గెలుచుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

