హసన్‌పర్తి, జూన్ 28 : దక్షిణాఫ్రికాలో శిక్షణ విమానానికి ప్రమాదం చోటుచేసుకొన్న ఘటనలో హనుమకొండ జిల్లా హసన్పర్తివాసి మృతి చెందాడు. మండల కేంద్రానికి చెందిన ఆడెపు చంద్రమోహన్ చిన్న కుమారుడు సుమంత్ (24) సౌత్ ఆఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో రెండేండ్లుగా పైలట్ శిక్షణ పొందుతున్నాడు.
శనివారం ప్రమాదవశాత్తు శిక్షణ పొందుతున్న ఫ్ల్లైట్ క్రాష్ కావడంతో సుమంత్ అక్కడికక్కడే మృతి చెందాడు.