Petrol | పెట్రోల్ బంకులకు క్యూ కట్టిన వాహనదారులు.. ఇంధన నిల్వలపై పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్
Petrol | పెట్రోల్, డీజిల్ కొరతతో రాష్ట్రవ్యాప్తంగా వాహనదారుల ఆందోళన నేపథ్యంలో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పందించింది. పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న వదంతులు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేసింది.
Petrol | పెట్రోల్, డీజిల్ కొరతతో రాష్ట్రవ్యాప్తంగా వాహనదారుల ఆందోళన నేపథ్యంలో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పందించింది. పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న వదంతులు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేసింది. సోషల్‌మీడియాలో వస్తున్న ప్రచారాలతో తప్పుడు ప్రచారాల కారణంగా ప్రజలు అనవసరంగా పెట్రోల్ బంకులను పరుగులు తీస్తూ, ట్యాంకులు నింపుకుంటున్నారని తెలిపింది.
ఈ భయాందోళనల కారణంగా సాధారణ స్థాయి కంటే 2.5 నుంచి 3 రెట్లు అధికంగా అమ్మకాలు జరుగుతున్నాయని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ తెలిపింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో తాత్కాలికంగా ఇంధన నిల్వలు తగ్గినట్లు కనిపిస్తున్నాయని పేర్కొంది. రాష్ట్రంలో ఎలాంటి ఇంధన కొరత లేదని స్పష్టంచేసింది. HPCL, IOCL, BPCL సంస్థల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని.. సరఫరా వ్యవస్థ సక్రమంగా కొనసాగుతుందని తెలిపింది.
పెట్రోల్ లేదా డీజిల్‌ను క్యాన్లలో నిల్వ చేయడం ప్రమాదకరమని.. ఇది PESO నిబంధనలకు విరుద్ధమని పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. ఇంధనాన్ని తప్పుగా నిల్వ చేయడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం తెలిపింది. భయాందోళనలతో అధికంగా ఇంధనాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకోవద్దని సూచించింది.

Petrol Dealers Associations
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

