ఖమ్మం, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): త్వరలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులే టి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఖమ్మం జిల్లా వైరా మండలంలోని విప్పలమడకలో ఆయన తనను కలిసిన నేతల తో మాట్లాడారు. ఈ నెల 15లోగా ఎ న్నికల నోటిఫికేషన్ రానున్నదని తెలిపారు.
ఇందుకు కార్యకర్తలు, నాయకు లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఇప్పటివరకు జోరుగా సాగుతున్న ఊహాగానాలకు మంత్రి వ్యాఖ్యలు ఊతమిచ్చినట్లయింది. 10లోగా నోటిఫికేషన్ ఇచ్చి 15న షెడ్యూల్ ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతున్నది. పంచాయతీ ఎన్నికలు మార్చి మొదటి వారంలో జరిగే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు.