హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ(టాస్) ప్రవేశాల గడువును అధికారులు పొడిగించారు. ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఆలస్య రుసుంతో ఆగస్టు 1 నుంచి 28 వరకు ప్రవేశాలు పొందవచ్చు.
హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): విద్యుత్ ఉద్యోగుల కార్మిక సంఘం 1104 రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జీ సాయిబాబు నాలుగోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్యవర్గం ఎన్నికలు శనివారం కొత్తపేటలోని రాజధాని గార్డెన్ ఫంక్షన్ హాల్లో జరిగాయి. ప్రస్తుత అధ్యక్షుడు వేమూరి వెంకటేశ్వర్లు, అదనపు ప్రధాన కార్యదర్శిగా జీ వరప్రసాద్ తిరిగి ఎన్నికయ్యారు.