ములుగు: తెలంగాణ నయాగారగా (Telangana Niagara) గుర్తింపు పొందిన బొగత జలపాతం (Bogatha water falls) పరవళ్లు తొక్కుతున్నది. ఎగువన కురుస్తున్న వానలతో జలపాతం ఉరకలెత్తుతున్నది. దీంతో జలసవ్వడులను చూడటానికి పర్యాటకులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లిలో ఈ జలపాతం ఉన్నది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో బొగతకు వరద ప్రవాహం పెరిగింది. దీంతో కొత్త అందాలను సంతరించుకున్నది.