రాయపర్తి: నిత్యం బిజీగా ఉండే పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తన కోసం వేచి ఉన్న అవ్వను చూసి చలించిపోయారు. చాలాకాలంగా పరిచయం ఉన్న వృద్ధురాలు ముద్రబోయిన పిచ్చమ్మను చూసి కాన్వాయ్ వాహనం దిగి వచ్చారు. ఆమెను ఆత్మీయ ఆలింగనం చేసుకొని ‘పిచ్చమ్మా.. బాగున్నవా..! కొడుకులు, బిడ్డలు, మనుమలు, మనుమరాండ్లు ఎట్లున్నరే..’ అంటూ కుశలం అడిగారు. సీఎం కేసీఆర్ అందిస్తున్న ఆసరా పింఛన్, రేషన్ బియ్యం, 24 గంటల ఇరాం లేని కరెంట్ సరఫరా, మిషన్ భగీరథ మంచినీళ్లు మంచిగ అందుతున్నాయా? అని ఆరా తీశారు. అవ్వను అమాత్యుడు ఆత్మీయంగా పలుకరించిన ఈ ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలకేంద్రంలో శనివారం చోటుచేసుకున్నది.