సిద్దిపేట అర్బన్, జూన్ 27: సిద్దిపేట మం డలం మిట్టపల్లి ఆంజనేయ స్వామి ఆలయం లో వెయ్యేండ్లనాటి అధికార నంది విగ్రహాన్ని గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ సోమవారం తెలిపారు. విడి విగ్రహాల్లో దేవీ, గణపతుల శిల్పాలతోపాటు కనిపించే మూడో శిల్పం అరుదైన ఆసన భంగిమలో.. వెనుక చేతుల్లో పరశువు, మృగంతో, ముందు కుడిచేయి వరద హస్తం గా, ఎడమ చేతిలో అధికార దండం కనిపిస్తున్నదని చెప్పారు. కుతుబ్షాహీల కాలంలో మహారాష్ట్ర నుంచి పిలిపించబడిన సిద్ధసోమాజి మిట్టపల్లిలో ఈ హనుమాన్ ఆలయాన్ని నిర్మించారని తెలిపారు.