హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 2421 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. కరోనా నుంచి మరో 3980 మంది బాధితులు తాజాగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 33104 కరోనా యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ఇవాళ 81417 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. జీహెచ్ఎంసీలో 649 మందికి కరోనా సోకింది.