హిమాయత్‌నగర్, డిసెంబర్ 22: పోరాట యోధుడు కేవల్ కిషన్ జాతరను అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చొప్పరి శంకర్ ముదిరాజ్ డిమాండ్ చేశారు.
శుక్రవారం నారాయణగూడలో మీడియా తో మాట్లాడుతూ మెదక్ జిల్లా పోలంపల్లిలో ఈ నెల 26న నిర్వహిం చే జాతరకు ప్రజలు పెద్దసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. అనేక గ్రామాల నుంచి ప్రజలు ఈ జాతరకు తరలివచ్చి ఎండ్ల బండ్లతో ఊరేగింపులు చేసి కిషన్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తారని వివరించారు.