Law Student Killed | బ్రేకప్ చెప్పిందని.. మహిళను హత్య చేసిన ప్రియుడి సోదరుడు
Law Student Killed | ఒక మహిళ తన ప్రియుడికి బ్రెకప్ చెప్పింది. ఇది తెలుసుకుని ప్రియుడి సోదరుడు ఆగ్రహించాడు. ఆ మహిళను కత్తితో పొడిచాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. దీంతో నిందితుడితో పాటు మహిళ ప్రియుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
బెంగళూరు: ఒక మహిళ తన ప్రియుడికి బ్రెకప్ చెప్పింది. ఇది తెలుసుకుని ప్రియుడి సోదరుడు ఆగ్రహించాడు. ఆ మహిళను కత్తితో పొడిచాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. దీంతో నిందితుడితో పాటు మహిళ ప్రియుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. (Law Student Killed) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. కోడిహళ్లి ప్రాంతంలో నివసించే అమృత లా చదువుతున్నది. ఒక పిజ్జా అవుట్‌లెట్‌లో పార్ట్-టైమ్ ఉద్యోగం కూడా చేసింది.
కాగా, ధనుష్ అనే వ్యక్తితో అమృతకు పరిచయం ఏర్పడింది. దీంతో వారిద్దరూ రిలేషన్ షిప్లో ఉన్నారు. అయితే ధనుష్‌కు పెళ్లై విడాకులు తీసుకున్నాడని, అతడికి ఒక బిడ్డ కూడా ఉన్నట్లు అమృతకు తెలిసింది. ఈ విషయం దాచాడన్న కారణంతో అతడికి బ్రేకప్ చెప్పింది.
మరోవైపు అమృత బ్రేకప్ నిర్ణయం పట్ల ధనుష్ సోదరుడు సూర్య ఆగ్రహించాడు. ఆమెను బెదిరించాడు. జూలై 13న అమృత ఇంటి వద్ద ఆమెను అడ్డుకోవడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో సూర్య కత్తితో అమృతపై దాడి చేశాడు. ఆమె ఛాతి, వీపు వెనుక కత్తితో పొడిచి పారిపోయాడు.
అయితే తీవ్రంగా గాయపడిన అమృత చికిత్స పొందుతూ మూడు రోజుల తర్వాత మరణించింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం సీవీ రామన్ ఆసుపత్రికి తరలించారు. నిందితుడైన సూర్యతో పాటు ధనుష్‌ను అరెస్ట్ చేశారు. వీరిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

