
దళిత బంధును దేశవ్యాప్తంగా అమలుచేయాలి
127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు టీఆర్ఎస్ మద్దతు: నామా
హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): దళిత బంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలుచేయాలని టీఆర్ఎస్ పార్టీ లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వర్రావు కేంద్రా న్ని కోరారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకం దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని అన్నారు. మంగళవారం ఆయన లోక్‌సభలో 127వ రాజ్యాంగ సవరణ బిల్లుపై మాట్లాడుతూ.. ఈ బిల్లుకు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతిస్తున్నట్టు ప్రకటించారు.
గచ్చిబౌలి స్టేడియానికి 52 కోట్లు ఇవ్వండి: రంజిత్‌రెడ్డి
గచ్చిబౌలి క్రీడాప్రాంగణాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునికీకరించడానికి రూ.52 కోట్లు కేటాయించాలని ఎంపీ రంజిత్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. మంగళవారం ఆయన లోక్‌సభ జీరో అవర్‌లో మాట్లాడుతూ.. ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన విషయాన్ని గుర్తుచేశారు. సానుకూలంగా స్పందించిన క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ త్వరలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.