Telangana Model Schools | హనుమకొండ చౌరస్తా, నవంబర్ 8: తెలంగాణ మోడల్ స్కూల్స్‌ను స్కూల్ ఎడ్యుకేషన్‌లో విలీనం చేయాలని, 010 హెడ్ఆఫ్ అకౌంట్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వేతనాలు చెల్లించాలచబడే విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ మోడల్ స్కూల్స్ టీచర్స్ నూతన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్.కిరణ్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ విద్యావ్యవస్థకు మోడల్ స్కూల్స్ ఆదర్శంగా నిలుస్తున్నప్పటికీ ఉపాధ్యాయుల సేవా నిబంధనలు ఇంకా అసమగ్రంగానే ఉన్నాయన్నారు. మోడల్ స్కూల్స్ టీచర్లను సాధారణ పాఠశాల ఉపాధ్యాయయులతో సమానంగా గుర్తించి, మోడల్ స్కూల్స్ సొసైటీని రద్దుచేసి స్కూల్ ఎడ్యుకేషన్ విభాగంలో విలీనం చేయాలన్నారు. మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్‌కు గెజిటెడ్ హోడా కల్పించాలని, అనంతరం పదోన్నతి అవకకాశం కలిపంచాలన్నారు. ఖాళీగా ఉన్న పోస్టుల్లో పీజీటీలకు ప్రిన్సిపాల్స్‌గా, టీజీటీలకు పీజీటీలుగా వెంటనే ప్రమోషన్ కల్పించి, మిగిలిన ఖాళీలకు నూతన నోటిఫికేషన్ విడుదలచేసి నియామకం చేపట్టాలన్నారు.
ఈ సమావేశంలో జనరల్ సెక్రటరీ కట్కూరి మహేందర్, వైస్ ప్రెసిడెంట్ గోపగాని విక్రమ్, ట్రెజరర్ ఎడ్ల రమేశ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పి.శ్రీధర్‌రెడ్డి, భాషబోయిన గంగరాజు, అన్వర్‌పాషా, రామగిరి రాజు, బొందిలి కళ్యాణ్‌సింగ్, శశికుమారి, కంఠాత్మకూర్ రమేశ్, రేనుకుంట్ల శ్యాంకుమార్ పాల్గొన్నారు.