హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నిషియన్ అభ్యర్థులకు తెలంగాణ మెడికల్ రిక్రూట్మెంట్ శుభవార్త చెప్పింది. ఈ వారం చివరలో స్టాఫ్ నర్స్ మెరిట్ లిస్ట్ విడుదల కానున్నది. మరో రెండ్రోజుల్లో ల్యాబ్ టెక్నిషియన్ పోస్టుల ప్రొవిజనల్ మెరిట్ లిస్టును బోర్డు విడుదల చేయనున్నది.
దీంతో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ మొదలుకానున్నది. రాష్ట్రవ్యాప్తంగా 2,322 నర్సింగ్ ఆఫీసర్లు, 1,284 ల్యాబ్ టెక్నిషియన్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఇక స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నిషియన్ల పోస్టుల కోసం అభ్యర్థులు 8 నెలల క్రితం పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.