హైదరాబాద్, జూన్17 (నమస్తే తెలంగాణన): జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శీనివాస్ రెడ్డి పేరొన్నారు. బుధవారం నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో నిర్వహించిన జర్నలిస్టుల సంక్షేమ నిధి చెకుల పంపిణీలో భాగంగా 21 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఇందులో 17 మంది చనిపోయిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులు, నలుగురు అనారోగ్యానికి గురైన జర్నలిస్టులు ఉన్నారు.
ఈ సందర్భంగా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమ నిధి పథకంలో భాగంగా మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఏకమొత్తంలో రూ. లక్ష అందించడంతోపాటు ఐదేండ్లపాటు నెలకు రూ.3 వేల పెన్షన్, కుటుంబంలోని గరిష్ఠంగా ఇద్దరు పిల్లలకు నెలకు రూ.1,000 చొప్పున ట్యూషన్ ఫీజు అందిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు 159 మందికి ఆర్థిక సహాయం అందజేసినట్లు శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.