దేవరుప్పుల, నవంబర్ 29 : జనగామ జిల్లావాసి ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ సివిల్ జడ్జిగా నియమితులయ్యారు. దేవరుప్పుల మండలం సీతారాంపురానికి చెందిన పెండెం మనోహర్, భవాని దంపతుల కుమారుడు ముఖేశ్‌కుమార్ జూనియర్ సివిల్ జడ్జిగా ఈ నెల 27న ఏపీ హైకోర్టు నుంచి నియామక పత్రాలు అందుకున్నారు.
వీరిది చేనేత కుటుంబం. ముఖేశ్‌కుమార్ 7వ తరగతి నుంచి టెన్త్ వరకు హైదరాబాద్ మహేంద్రా హిల్స్‌లోని మాతాఅమృత నందిని పాఠశాలలో, ఇంటర్ నారాయణ కళాశాల, బీటెక్ నల్లా నర్సింహారెడ్డి కళాశాల, వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ, ఉస్మానియాలో ఎల్ఎల్ఎం పూర్తి చేశారు.