హైదరాబాద్, సిటీబ్యూరో, జూలై 3 (నమస్తే తెలంగాణ): ఎస్సీ వర్గీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మాలల గొంతు కోసిందని తెలంగాణ మాల సంఘాల జేఏసీ చైర్మన్ మాందాల భాస్కర్ విమర్శించారు. రోస్టర్ విధానంలో మాలలకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఈ అంశంపై భవిష్యత్తులో పెద్దఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.
గురువారం మాల సంఘలు, అనుబంధ సంఘాలు ఏకగీవ్రంగా మాల సంఘాల జేఏసీ చైర్మన్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఎస్సీ ఉద్యోగుల్లో 46 వేలమంది మాదిగలు ఉంటే, 36వేల మంది మాలలు ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణతోపాటు, రోస్టర్ విధానంపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు.