9న గాంధీభవన్ ముందు ఆవేదన దండోరా
ఖైరతాబాద్, ఫిబ్రవరి 3: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో మాదిగలకు తీరని అన్యాయం జరుగుతున్నదని టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి దేవని సతీశ్మాదిగ అన్నారు. గురువారం సాయంత్రం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాదిగలకు సరైన ప్రాతినిధ్యం కల్పించడం లేదని పేర్కొన్నారు. ఈ నెల 9న రాష్ట్ర ఇన్చార్జి మానిక్కం ఠాకూర్ గాంధీభవన్‌కు వస్తున్న సందర్భంగా దాని ఎదురుగా ఆవేదన దండోరా కార్యక్రామన్ని నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో నాయకులు జాన్, రమేశ్, రాజు, సైదులు తదితరులు పాల్గొన్నారు.