హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదురొంటున్న సమస్యలను పరిషరించాలని తెలంగాణ వరింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర యాక్టింగ్ ప్రెసిడెంట్ పీ రాంచందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల ప్రక్రియ ముందు కు సాగడం లేదని పేర్కొన్నారు. టీడబ్ల్యూజే ఎఫ్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం హెచ్‌యూజే ఆధ్వర్యంలో హైదరాబా ద్ కలెక్టర్ కార్యాలయం వద్ద జర్నలిస్టులు నిరసన వ్యక్తంచేశారు. హైదరాబాద్ జిల్లా అదన పు కలెక్టర్ జితేందర్‌రెడ్డి, డీఆర్వో నారాయణ ను కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఈ సం దర్భంగా రాంచందర్ మాట్లాడుతూ.. అర్హత ఉన్నవారికి అక్రెడిటేషన్ కార్డులివ్వాలని డి మాండ్ చేశారు. హెచ్‌యూజే అధ్యక్షుడు అరుణ్‌కుమార్, కార్యదర్శి జగదీశ్వర్, వరిం గ్ ప్రె సిడెంట్ గండ్ర నవీన్, కోశాధికారి రాజశేఖర్, డీజేఎఫ్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మస్తాన్, టీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి బీ బసవపున్నయ్య, జర్నలిస్టులు పాల్గొన్నారు. కాగా, రేపు ఐ అండ్ పీఆర్ కమిషనర్ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాను జర్నలిస్టులు విజ యవంతం చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 18,536 జర్నలిస్టు అక్రెడిటేషన్లు జారీచేసినట్టు సమాచార పౌర సంబంధాల శాఖ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రస్థాయిలో 3,619, జిల్లాల్లో 14,917 కార్డులు మాత్రమే మంజూరుచేశామని వెల్లడించింది. జనగామ జిల్లాలో 246 మందికి కార్డులు ఇచ్చామని ప్రకటించింది. మిగిలిన జర్నలిస్టులకు కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతున్నదని పేర్కొన్నది. కేబుల్ ఛానల్స్ జర్నలిస్టులకు కార్డుల జారీ కోసం జిల్లాలకు నివేదిక పంపిస్తున్నామని తెలిపింది. కోర్టు కేసు కారణంగానే పాత కార్డుల గడువును పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. ‘కలం కార్మికులపై కాంగ్రెస్ కక్ష’ పేరిట సోమవారం ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమయ్యింది. ఈ కథనంలో 20 వేల కార్డులు ఇచ్చినట్టు రాయగా, 18వేల కార్డులు మాత్రమే ఇచ్చినట్టు వెల్లడించడం గమనార్హం.