హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): ‘జయ జయహే తెలంగాణ’ పాట రాసింది ఎవరనేదే ముఖ్యమని, ఎవరు పాడారనే చర్చ అవసరం లేదని తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. ‘జయజయహే’ గీతం రాసింది తెలంగాణ కవి అని, దానికి విశేష ప్రజాదరణ ఉన్నదని గుర్తు చేశారు.
తన పాటకు మంచి సంగీతం రావాలని కవి కోరుకుంటారని, రకరకాల పరిశీలనల తర్వాతే కీరవాణిని ఎంపిక చేసినట్టు తెలిపారు. సచివాలయంలో గురువారం సీఎం రేవంత్‌రెడ్డితో జరిగిన సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ చిహ్నం అంటే కట్టడాలు మాత్రమే కాదని పేర్కొన్నారు. అధికారిక చిహ్నంలో ప్రజల జీవన విధానం, సంస్కృతి ప్రతిబింబించాలని పేర్కొన్నారు. కొత్త చిహ్నంలో కట్టడాలు ఉంటాయి కావొచ్చని, పూర్తి రూపం వచ్చిన తర్వాతే తెలుస్తుందని చెప్పారు. ఛత్తీస్‌గఢ్ లోగోలో కోటలు ఉంటాయని గుర్తుచేశారు.