హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ జాగృతి నిర్ణయించింది. బుధవారం నుంచి ఆదివారం వరకు ఐదు రోజులపాటు ఉమ్మడి జిల్లాల సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలంగాణ జాగృతి సోమవారం వెల్లడించింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అధ్యక్షతన జరిగే సమావేశాల్లో డిసెంబర్ 4న ఉమ్మడి వరంగల్, నిజామాబాద్ జిల్లాలు, 5న కరీంనగర్, నల్గొండ, 6న రంగారెడ్డి, ఆదిలాబాద్, 7న హైదరాబాద్, ఖమ్మం, ఆదివారం మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల సమీక్ష నిర్వహిస్తారు.
హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వన్యప్రాణి సంరక్షణ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. ముఖ్యమంత్రి చైర్మన్‌గా, అటవీశాఖ మంత్రి వైస్ చైర్మన్‌గా,చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్‌ను మెంబర్ సెక్రటరీగా నియమించింది.