రాజకీయ అక్కసుతోనే తెలంగాణకు అన్యాయం
పారిశ్రామికాభివృద్ధిలో ఇతర రాష్ర్టాలకు రోల్ మోడల్‌గా నిలుస్తున్న తెలంగాణకు రాజకీయ అక్కసుతోనే కేంద్రం అన్యాయం చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆరోపించారు.
- సెమీకండక్టర్ ప్రాజెక్టు కేటాయింపులో కేంద్రం వివక్ష
- కేంద్రంపై రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు మండిపాటు
హైదరాబాద్, ఆగస్టు 13(నమస్తే తెలంగాణ): పారిశ్రామికాభివృద్ధిలో ఇతర రాష్ర్టాలకు రోల్ మోడల్‌గా నిలుస్తున్న తెలంగాణకు రాజకీయ అక్కసుతోనే కేంద్రం అన్యాయం చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆరోపించారు. సెమీకండక్టర్ ప్రాజెక్టు కేటాయింపులో వివక్ష చూపించి, రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నదంటూ బుధవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. ‘ప్రపంచస్థాయి అధునాతన సిస్టం అండ్ ప్యాకేజింగ్ ఫెసిలిటీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. మహేశ్వరంలో 10 ఎకరాల భూమి కేటాయించాం. అన్ని రకాల సబ్సిడీలకు ఆమోదం తెలిపాం. రికార్డు సమయంలో అన్ని అనుమతులిచ్చాం. ఇండియా సెమీకండక్టర్ మిషన్ తుది ఆమోదం లభిస్తే పనులు మొదలు పెట్టేందుకు సదరు ఇన్వెస్టర్ సిద్ధంగా ఉన్నారు. అయినా, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు’ అని విమర్శించారు.
ఏపీకి ఎలా కేటాయిస్తారు?
అన్ని రకాలుగా అర్హతలున్న తెలంగాణను విస్మరించి కనీస సంసిద్ధత లేని ఏపీకి ప్రాజెక్టును ఎలా కేటాయిస్తారని మంత్రి శ్రీధర్‌బాబు కేంద్రాన్ని ప్రశ్నించారు. ‘తర్కానికి అందని, న్యాయ విరుద్ధమైన ఈ నిర్ణయం పెట్టుబడిదారులకు తప్పుడు సంకేతాలు పంపే ప్రమాదముంది. ఇలాంటి రాజకీయ ప్రేరేపిత నిర్ణయాలు దేశ పారిశ్రామికాభివృద్ధికి మంచిది కాదు. అందుకే ఈ నిర్ణయాన్ని మరోసారి పునఃపరిశీలించాల్సిన అవసరముంది. వాస్తవ పరిస్థితులను పరిగణలోనికి తీసుకుని తెలంగాణకు మేలు చేసేలా కేంద్రం నిర్ణయం తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

