గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 09, 2020 , 00:59:27

వైద్యరంగానికి రూ.6,185.96 కోట్లు

వైద్యరంగానికి రూ.6,185.96 కోట్లు
  • గతేడాదితో పోలిస్తే రూ.491.79 కోట్లు అధికం
  • కేసీఆర్‌ కిట్ల పథకం అమలుకు రూ.480 కోట్లు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రజారోగ్య పరిరక్షణలో తెలంగాణ ప్రగతి సాధిస్తున్నది.  వైద్యరంగంలో అనూహ్యమైన మార్పులు తీసుకొస్తు న్నది. అధునాతన సౌకర్యాలు కల్పిస్తూ వైద్యసేవలు అందిస్తున్నది. సర్కారు వైద్యం పట్ల ప్రజల్లో విశ్వాసం పెంచిన ప్రభుత్వం.. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌లో వైద్యరంగానికి భారీగా నిధులు కేటాయించింది. గతేడాది రూ.5,694.17 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.6,185.96 కోట్లు ప్రతిపాదించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖకు 491.79 కోట్లు అధికంగా ప్రతిపాదించారు. దీంతో మరిన్ని వసతులు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న కేసీఆర్‌ కిట్ల పథకం అమలు కోసం ప్రస్తుత బడ్జెట్‌లో ప్రత్యేకంగా రూ.480 కోట్లు కేటాయించారు.
logo
>>>>>>