ప్రభాస్ కంటే అల్లు శిరీష్ సినిమాకే రికార్డులు ఎక్కువ..

వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. జరిగింది కూడా ఇదేమరి. అందుకే అక్కడ అల్లు శిరీష్ సినిమా కంటే ప్రభాస్ సినిమాకు తక్కువ వ్యూవర్ షిప్ వచ్చింది. అసలు విషయం ఏంటంటే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు తెలుగుతో పాటు హిందీలో కూడా బ్రహ్మాండమైన ఇమేజ్ ఉంది. ఆయన డబ్బింగ్ సినిమాలకు అక్కడ అద్భుతమైన వ్యూవర్ షిప్ వస్తుంది. ఇప్పుడు కూడా మరోసారి ఇదే జరిగింది. అల్లు అర్జున్ నటించిన సరైనోడు, అల్లు శిరీష్ నటించిన ఏబిసిడి (అమెరికన్ బార్న్ కన్ఫ్యూషన్ దేశీ) గత వారం అత్యధిక టిఆర్పి సాధించిన హిందీ డబ్బింగ్ సినిమాలుగా చరిత్ర సృష్టించాయి.
బార్క్ రేటింగ్స్ ఆధారంగా హిందీ ప్రేక్షకులు సరైనోడు, ఏబిసిడి సినిమాలపై ఎక్కువ మక్కువ చూపించారని రేటింగ్స్ నిరూపిస్తున్నాయి. సరైనోడు, ఏబిసిడి సినిమాలకు 4863,4016 యావరేజ్ మినిట్ ఆడియన్స్ (AMA) వచ్చింది. బాహుబలి ది కంక్లూజన్ కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం. అదే వారం బాహుబలి కూడా టీవీలో ప్రసారమైంది. దీనికి 3609 యావరేజ్ మినిట్ ఆడియన్స్ నమోదయింది. తమ సినిమాపై హిందీ ఆడియన్స్ చూపించిన ప్రేమపై అల్లు శిరీష్ స్పందించారు. తన సినిమాకు నిజంగా ఇంత అద్భుతమైన రేటింగ్స్ వస్తాయని అనుకోలేదని.. హిందీ ప్రేక్షకులు తనపై చూపించిన ప్రేమ మాటల్లో చెప్పలేను అంటున్నారు.
సినిమాలో వినోదం కారణంగా వాళ్ళు అంత బాగా కనెక్ట్ అయ్యారు అని చెప్పుకొచ్చారు శిరీష్. ఒక నటుడిగా వాళ్లను అలరించడానికి తన వంతు ప్రయత్నం చేస్తాను అంటున్నారు శిరీష్. ఏబిసిడి హిందీ శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న గోల్డ్ మైన్స్ టెలీ ఫిలిమ్స్ చెప్పిన దాని ప్రకారం.. ఈ సినిమాలోని అద్భుతమైన వినోదం కారణంగా హిందీ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ABCD పూర్తిగా ఫన్ ఫిలిం. అల్లు శిరీష్ తన స్క్రీన్ ప్రెజెన్స్, నటనతో ఆకట్టుకున్నాడు అని తెలిపారు. బాక్సాఫీస్ దగ్గర అల్లు బ్రదర్స్ సినిమాలు రికార్డులు సృష్టిస్తున్నాయి. అలాగే యూట్యూబ్ లో కూడా వాళ్లకు మంచి వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు ఇదే జోరు టెలివిజన్ లో కూడా చూపిస్తున్నారు అల్లు సోదరులు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- allu sirish
- Prabhas
- trp
RELATED ARTICLES
తాజా వార్తలు
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

