హైదరాబాద్, జూన్3 (నమస్తే తెలంగాణ) : తెలంగాణకు పొరుగు రాష్ట్రాల నుంచి ఉల్లిగడ్డ భారీగా దిగుమతి అవుతున్నది. రాష్ట్రంలో అతి పెద్దదైన హైదరాబాద్లోని మలక్పేట గంజి మార్కెట్కు సోమవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో ఉల్లిగడ్డ దిగుమతి అయింది. 141 లారీల ఉల్లి దిగుమతి కాగా, మహారాష్ట్ర నుంచే అత్యధికంగా 105 లారీల ఉల్లిగడ ్డ వచ్చిందని మార్కెటింగ్ అధికారులు తెలిపారు.
ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లో ఉల్లి క్వింటాకు రూ.1,500 నుంచి రూ.1,800గా పలుకుతున్నది. మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు.