Venkaiah Naidu | తెలంగాణ మరింత ఉన్నత శిఖరాలకు చేరాలి: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మహోజ్వల చరిత, గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉన్న రాష్ట్రం తెలంగాణ.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మహోజ్వల చరిత, గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉన్న రాష్ట్రం తెలంగాణ. సంప్రదాయ విలువలు, ఆధునికత మేళవించిన రాష్ట్రం తెలంగాణ. సుసంపన్నమైన సహజ వనరులు, అద్భుతమైన మానవ వనరులతో విభిన్న రంగాల్లో సుస్థిర అభివృద్ధికి చిరునామా తెలంగాణ రాష్ట్రం.
భిన్న సంస్కృతులను, భిన్న ప్రాంతాల ప్రజలను అక్కున చేర్చుకుంటూ మినీ భారత్ లాగా విలసిల్లే తెలంగాణ రాజధాని హైదరాబాద్… భిన్నత్వంలో ఏకత్వానికి, సౌబ్రాతృత్వానికి గొప్ప ప్రతీక. భారత అభివృద్ధి పయనంలో తెలంగాణ మరింత కీలక భూమిక పోషించాలని, అభివృద్ధిలో రాష్ట్రం మరింత ఉన్నత శిఖరాలకు చేరాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మహోజ్వల చరిత, గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉన్న రాష్ట్రం తెలంగాణ. సంప్రదాయ విలువలు, ఆధునికత మేళవించిన రాష్ట్రం తెలంగాణ. సుసంపన్నమైన సహజ వనరులు, అద్భుతమైన మానవ వనరులతో విభిన్న… pic.twitter.com/vIiFYIh7rA
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) June 2, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

