హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార చెప్పారు. పెట్టుబడులకు స్వర్గధామంగా మారిన హైదరాబాద్‌కు ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడులు తరలివస్తున్నాయని హైదరాబాద్‌లో సీఐఐ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ల (సీఎఫ్‌వో) సదస్సులో భట్టి తెలిపారు. రాష్ట్రంలో పట్టణాల సంఖ్య గణనీయంగా ఉన్నదని, ఆధునికత అభ్యుదయానికి కేంద్రంగా మారిందన్నారు. మారుతున్న ప్రపంచంలో ఫైనాన్స్ రంగం కేవలం లెకల పరిరక్షణకే పరిమితం కాదని, సీఎఫ్‌వోలు ఇప్పుడు సంస్థల దశాదిశను నిర్దేశించే మార్గదర్శకులని పేర్కొన్నారు. బలమైన, విప్లవాత్మక నిర్ణయాల కోసం సీఎఫ్‌వోలు టెక్నాలజీని ఒడిసిపట్టాలని సూచించారు.