Inter Results | హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ ఫలితాలు ఈ నెలాఖరులో విడుదల కానున్నాయి. అధికారిక సమాచారం మేరకు ఈ నెల 25న ఫలితాలు విడుదల చేయనున్నారు. వీలైతే ఈ నెల 24నే ఫలితాలు విడుదల చేయాలని ఇంటర్‌బోర్డు భావిస్తున్నది. ఈ సారి వాట్సాప్‌నకు ఫలితాలు పంపించేందుకు బోర్డు ప్రయత్నాలు చేస్తున్నది.
ఇప్పుడు కాకపోతే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల కల్లా కచ్చితంగా సిద్ధం చేస్తామని ఓ అధికారి పేర్కొన్నారు. ఫలితాల విడుదలపై ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య స్పందిస్తూ.. ప్రస్తుతం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ)లో క్రోడీకరణ జరుగుతున్నదని, ప్రక్రియ పూర్తయ్యేందుకు వారం రోజులు పడుతుందని తెలిపారు. ఈ నెల నాలుగో వారంలో ఫలితాలు విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఇంటర్ పరీక్షలను మార్చి 5 నుంచి 25 వరకు నిర్వహించారు.