హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): వైద్య, ఆరోగ్య సిబ్బందితోపాటు ఫ్రంట్లైన్ వారియర్లకు కరోనా వ్యాధి నిరోధక టీకాలు వేయడంలో తెలంగాణ ముందు వరుసలో కొనసాగుతున్నది. తెలంగాణతోపాటు గుజరాత్, కేరళ, బిహార్ రాష్ర్టాల్లో వైద్య, ఆరోగ్య సిబ్బందికి తొలి డోసు వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తయ్యింది. తెలంగాణలో 76.7 శాతం మందికి రెండు డోసులు పూర్తయ్యాయి. ఫ్రంట్లైన్ వారియర్లకు వందశాతం తొలి డోస్ వేసిన రాష్ర్టాల్లో హర్యాన, కేరళ, బిహార్, ఛత్తీస్గఢ్ ఉన్నాయి. రాష్ట్రంలోని ఫ్రంట్లైన్ వారియర్లలో మొదటి డోసు 98.1శాతం మంది, రెండో డోసు 68 శాతం మంది తీసుకున్నారు. ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వారియర్లకు టీకా కార్యక్రమం పూర్తి చేయడంలో పంజాబ్, ఢిల్లీ రాష్ర్టాలు అట్టడుగు స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా కోటి మంది ఆరోగ్య సిబ్బంది మొదటి డోసు వ్యాక్సిన్లు తీసుకోగా, 84 లక్షల మంది రెండో డోసు తీసుకున్నారు. ఫ్రంట్లైన్ వారియర్లలో 1.8 కోట్ల మంది మొదటి డోసు తీసుకోగా, 1.3 కోట్ల మంది రెండో డోసు తీసుకున్నారు.