Nizamabad | హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ) : రోగులను పట్టించుకోకుండా దవాఖానలో పుట్టిన రోజు వేడుకలు చేసుకున్న నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ ప్రతిమరాజ్‌ను ప్రభుత్వం సస్పెం డ్ చేసింది. ఆమెపై విచారణకు ఆదేశించింది. వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టి నా జడ్ చొంగ్తు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈనెల 10 రాత్రి సూపరింటెండెంట్ చాంబర్‌ను ఫంక్షన్ హాల్ స్థాయిలో అలంకరించడం, కేకు, బొకేలు, బహుమతులతో అట్టహాసంగా వేడుకలు నిర్వహించారు. ఫిట్స్‌తో బాధపడుతూ వచ్చి న రోగిని సిబ్బంది పట్టించుకోలేదు. బాధిత మహిళను ఆమె భర్త భుజాన వేసుకొని ఏడు అంతస్తులు కలియదిరిగినా ఫలితం లేకపోయింది. చివరికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ఫోన్ చేస్తే అర్ధరాత్రి దాటిన తర్వాత చికిత్స అందించినట్టు బాధితులు తెలిపారు. ఈ ఘటనపై నమస్తే తెలంగాణలో ‘దవాఖాననా? ఫంక్షన్ హాలా?’ శీర్షికన కథనం ప్రచురించగా, సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.