Telangana High court | హైదరాబాద్ : తెలంగాణలో 11 జిల్లా జడ్జి పోస్టుల( Judge Posts ) భర్తీకి రాష్ట్ర హైకోర్టు( High Court ) చర్యలు చేపట్టింది. హైకోర్టు వెబ్సైట్లో జడ్జి పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలను పొందుపరిచారు. ఈ నెల 12వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అదే రోజు నుంచి అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తునకు మే 1వ తేదీ వరకు అవకాశం కల్పించారు. జూన్ 24, 25 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. తదితర వివరాల కోసం హైకోర్టు వెబ్సైట్ను సందర్శించొచ్చు.