హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): న్యాయ విద్య కోర్సుల్లో అడ్మిషన్లను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
క్యాలెండర్ ప్రకారం అడ్మిషన్లు చేసేందుకు ఇరుపక్షాలు అంగీకరించడంతో పిటిషన్‌పై విచారణను ముగిస్తున్నట్టు ప్రకటించింది. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో కౌన్సెలింగ్‌ను జూలైలోపు పూర్తి చేయకపోవడంపై న్యాయవాది భాసర్‌రెడ్డి దాఖలు చేసిన పిల్‌పై విచారణ జరిపింది.