హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): అమెరికన్ బుల్‌డాగ్స్ లాంటి క్రూరమైన 25 రకాల విదేశీ శునకాల దిగుమతి, పెంపకాన్ని నిషేధిస్తూ మార్చి 12న కేంద్రం జారీచేసిన సర్యులర్పై హైకోర్టు స్టే విధించింది. సర్క్యులర్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు. కౌంటర్ దాఖలు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసి.. విచారణను జూలై5కి వాయిదా వేశారు.