సస్పెండైన న్యాయవాది ఉషిరెడ్డిపై చర్యలు.. హైకోర్టు ఆదేశం
రాష్ట్ర బార్ కౌన్సిల్ సస్పెండ్ చేసినప్పటికీ న్యాయవాదిగా కోర్టు విచారణలకు హాజరవుతున్న ఉషిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఉషిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని రిజిస్ట్రార్ (మేనేజ్మెంట్)కు, కోర్టు పాలనలో జోక్యం చేసుకుంటున్నందున కోర్టు ధికరణ చర్యలు ప్రారంభించాలని రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)కు స్పష్టం చేసింది.
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర బార్ కౌన్సిల్ సస్పెండ్ చేసినప్పటికీ న్యాయవాదిగా కోర్టు విచారణలకు హాజరవుతున్న ఉషిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఉషిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని రిజిస్ట్రార్ (మేనేజ్మెంట్)కు, కోర్టు పాలనలో జోక్యం చేసుకుంటున్నందున కోర్టు ధికరణ చర్యలు ప్రారంభించాలని రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)కు స్పష్టం చేసింది. 2025లో ఉషిరెడ్డిని సస్పెండ్ చేస్తూ రాష్ట్ర బార్ కౌన్సిల్ నోటిఫికేషన్ జారీచేసిన విషయం కోర్టు దృష్టికి వచ్చింది.
దీంతో ఈ వ్యవహారానికి సంబంధించిన రికార్డులు, కౌంటర్లను పరిశీలించిన జస్టిస్ నగేశ్ భీమపాక.. బార్ కౌన్సిల్ సస్పెన్షన్‌కు గురైన వ్యక్తి దేశంలోని ఏ కోర్టులోనూ న్యాయవాదిగా లేదా వ్యక్తిగత హోదాలో వాదనలు వినిపించడానికి వీల్లేదని పేరొన్నారు. ఇందుకు విరుద్ధంగా కోర్టు విచారణలకు హాజరవుతున్న ఉషిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు, కోర్టు ధికరణ చర్యలు ప్రారంభించాలని రిజిస్ట్రీలను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వుల ప్రతిని రాష్ట్ర బార్ కౌన్సిల్‌కు పంపాలని, ఈ విషయాన్ని రాష్ట్రంలోని అన్ని బార్ అసోసియేషన్లకు తెలియజేయాలని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

